
విద్వేషపు మంటలు -నీచమైన ఎత్తుగడలు : తిప్పికొడదాం - శక్తి చాటుదాం : సీఎం కేసీఆర్..!!
తెలంగాణ జాతీయ సమైక్యతదినోత్సవం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సమాజం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు అనేక రంగాల్లో ముందుందని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయికంటే ముందుందన్నారు. ప్రభుత్వ కృషి వల్ల జలవనరులు, పంటల దిగుబడి పెరిగిందని వివరించారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు.