మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ ?
హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అమిగోస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఐతే, తాజాగా వినిపిస్తున్న రూమర్ ప్రకారం.. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, కళ్యాణ్ రామ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన కథ పై చర్చలు కూడా జరుగుతున్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి. పైగా ప్రశాంత్ వర్మ ఇప్పటికే కళ్యాణ్ రామ్ కి స్టోరీ లైన్ చెప్పాడని.. కళ్యాణ్ రామ్ కూడా ఆ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఐతే, ఈ వార్తను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఎలాగూ ప్రశాంత్ వర్మ ఎప్పటినుంచో బెటర్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. నిజానికి బాలయ్య అన్‌స్టాపబుల్ 2 టీజర్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. టీజర్ లో బాలకృష్ణను చాలా బాగా చూపించాడు. అందుకే, బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కానీ, ఇప్పటికే బాలయ్య వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందుకే, ప్రశాంత్ వర్మ అంతలో బాలయ్య ఫ్యామిలీకే చెందిన కళ్యాణ్ రామ్ తో ఓ ప్రాజెక్టు ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు.
