అక్కడ 50 కోట్ల క్లబ్ లో “జైలర్”.!

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి రజిని నుంచి ఓ గట్టి కం బ్యాక్ కోసం అంతా చూస్తుండగా ఈ చిత్రంతో అది ఫ్యాన్స్ కి దక్కింది. ఇక ఇప్పటికే 400 కోట్ల మేర భారీ గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం మన తెలుగు స్టేట్స్ లో కూడా అదిరే వసూళ్ళని ఈ చిత్రం అందుకోగా లేటెస్ట్ గా అయితే కర్ణాటకలో కూడా భారీ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది.


మరి ఈ చిత్రం 9 రోజుల్లో అయితే కర్ణాటకలో 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీనితో తమిళ్ నుంచి రెండో చిత్రంగా జైలర్ ఈ ఫీట్ ని అందుకున్న దానిగా నిలిచింది. మరి ఈ మొత్తం 9 రోజుల్లో ఈ చిత్రం 52.2 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే శివ రాజ్ కుమార్ మరియు మోహన్ లాల్ లు పవర్ ఫుల్ క్యామియో రోల్స్ లో నటించారు.