
స్టేడియంలోకి.. నో ఫ్లాగ్స్ ప్లీజ్
ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆయా జట్ల జెండాలను స్టేడియాల్లోకి అనుమతించడం లేదు. ఫ్లాగ్స్‌కుండే ప్లాస్టిక్ కడ్డీల ద్వారా లోపల హింస చెలరేగే అవకాశం ఉందని, వాటిని మైదానంలోకి విసిరితే క్రికెటర్లు కూడా గాయపడే ప్రమాదం ఉంటుందని ముంబై పోలీసులు, బీసీసీఐ భావిస్తోంది. అందుకే స్టిక్స్‌తో కూడిన జెండాలను లోనికి అనుమతించేది లేదని పోలీసు శాఖ తేల్చి చెప్పింది.