పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై ఇంట్రెస్టింగ్ డీటైల్స్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో ఇంకా టైటిల్ పెట్టని చిత్రం ఉన్నాయి. అలాగే వినోదయ సీతం రీమేక్ పవన్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్, పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి ఈ సినిమా రీమేక్ అని ధృవీకరించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ అనేది విజయ్ నటించిన తేరికి అధికారిక రీమేక్ అని ఒక టాక్ ఉంది, కానీ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఏ సినిమాను రీమేక్ చేస్తున్నారో ఆనంద్ సాయి చెప్పలేదు. హరీష్ శంకర్ అండ్ టీమ్ మార్పులు మరియు పవన్ లుక్స్ పై కసరత్తు చేస్తున్నారని ఆయన అన్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ ను గబ్బర్‌సింగ్ గా రీమేక్ చేసిన హరీష్, రీమేక్ వెర్షన్‌లో చాలా మార్పులు చేశాడు. ఆ మార్పులు చిత్రానికి పెద్దగా సహాయపడ్డాయి. పవన్ కు గబ్బర్ సింగ్ చిత్రం సాలిడ్ కమ్ బ్యాక్ ను ఇచ్చింది. మరి ఈసారి స్టార్ నటుడిని హరీష్ శంకర్ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.
