
బాలయ్య నెక్స్ట్ టైటిల్ లాంచ్ పై క్లారిటీ?
ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తో “వీరసింహా రెడ్డి” అనే ఓ క్రేజీ మాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత బాలయ్య కూడా తన కెరీర్ లో బెస్ట్ లైనప్ ని సెట్ చేసుకోగా ఈ సినిమా కంప్లీట్ అయ్యిన వెంటనే వరుస విజయాలు దర్శకుడు అనీల్ రావిపూడి తో అయితే తాను తన కెరీర్ లో 108వ సినిమాని చేయనున్నారు.
ఇక ఈ సాలిడ్ చిత్రం పై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ తెలుస్తోంది. ఈ చిత్రంపై అప్పుడే టైటిల్ ని కూడా మేకర్స్ లాక్ చేసేసి ఈ డిసెంబర్ 8 నే అనౌన్స్ చేయనున్నట్టు గా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ టాక్ అవాస్తవం అన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని అయితే అనీల్ ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.