సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్క్ వేసుకున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్ వినూత్నంగా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ ఆద్యంతం హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌తో నింపేసింది చిత్ర యూనిట్. దర్శకుడు మహేష్ సూరపనేని తెరకెక్కించిన ఈ సినిమాలో ఒకే శరీరాన్ని సుధీర్ బాబుతో పాటు మరొకరు పంచుకుంటున్నారనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ టీజర్ మొదట్లో ‘‘అతడు అర్జున్ A, నువ్వు అర్జున్ B.. ఒకే శరీరాన్ని పంచుకుంటున్నారు..’’ అంటూ డాక్టర్ చెప్పడంతో ఈ సినిమా థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రానుందనే విషయం స్పష్టం అవుతోంది. కాగా, ఈ సినిమాలో సుధీర్ బాబు ఓ కాప్ పాత్రలో నటిస్తుండగా, ఆయన పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమాకు ‘గన్స్ డోంట్ లై’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ పెట్టి ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ హంట్ మూవీ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.