
బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను నేను పరిష్కరిస్తా : KTR
KTR: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఐటి కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. త్వరలోనే ఆదిలాబాద్ ఐటి పార్కుకు శంకుస్థాపన చేసి, దాని అభివృద్దికి పూర్తి సహకారం అందజేస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కెటిఆర్ జిల్లా కేంద్రంలోని ఐటి కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఉద్యోగులు పట్టుదలతో కష్టపడుతూ మరిన్ని ఐటీ కంపెనీలు ఆదిలాబాద్ వైపు దృష్టి సారించేలా చూడాలని దిశ నిర్దేశం చేశారు. కంపెనీ భవనం ఆధునీకరణ కోసం, విద్యుత్ సమస్యను అధిగమించడం కోసం కోటిన్నర రూపాయలను నిధులను వెంటనే కెటాయిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ తన సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి బాసర ట్రిపుల్‌ఐటీ కాలేజీని సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. రాజకీయ నేతల స్పీచ్‌లను స్టూడెంట్స్ వినరని ..తాను చదువుకున్న రోజుల్లో వినే వాళ్లం కాదన్నారు.
సెల్‌ఫోన్‌లు చేతిలో ఉంటే ఇంకేం చదువుతారన్నారు మంత్రి. తన కుమారుడిని కూడా రోజూ చూస్తున్నానన్నారు. బాసర విద్యార్థులు చేసిన ఆందోళన అభినందనీయని చెప్పారు. శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలపడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు ప్రస్తుతం ఐటి రంగంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, అంతర్జాతీయ స్థాయి కంపెనీల కోసం ఇక్కడి నుంచే పనిచేయడం గర్వ కారణమని మంత్రులు తెలిపారు.