
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని ఇంటి బయటే పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి బయటకు వస్తే అరెస్ట్ చేస్తానంటే ఎలా అని రేవంత్ ప్రశ్నించారు. మీకు అభ్యంతరం ఉంటే ధర్నాచౌక్ దగ్గర అరెస్ట్ చేయండి అని పోలీసులకు తెలిపారు.
తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, విజయారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఇంటి వద్ద ఘర్ణణ వాతావరణం నెలకొంది.