ఈ వారంలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : హరీష్‌రావు

హైదరాబాద్ : ఈ వారంలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ చెప్పాలన్నారు. మీ పాదయాత్రలో నిరుగ్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పోలీస్ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించిన.. ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. కులాల పేరుతో చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.