
Canvas Black Edition Super Splendor : అదిరిపోయే డిజైన్, కిల్లింగ్‌లుక్స్
ధర రూ. 77,430 నుంచి ప్రారంభం
హీరో కంపెనీ స్ప్లెండర్ మోడల్‌లో ఒక సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను కంపెనీ ప్రకటించింది. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది.
హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజన్
ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్‌డేటెడ్ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ఎంపికతో వస్తుంది.