‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రపంచవ్యాప్తంగా 3Dలో సమంత మూవీ..

స్టార్ హీరోయిన్ సమంత నటించిన మరో చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ దృశ్య కావ్యంగా తీర్చిదిద్దిన మైథలాజికల్ డ్రామా ‘శాకుంతలం’ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు మేకర్స్. ఇటీవలే ‘యశోద’ చిత్రంతో సక్సెస్ అందుకున్న సమంత.. అదే ఊపులో ‘శాకుంతలం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుండగా.. మొత్తానికి లాక్ చేసిన తేదీని ప్రకటించారు.

నాగచైతన్యతో వివాహానికి ముందు ఎక్కువగా బబ్లీ అండ్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలు చేసిన సమంత (Samantha) ఆ తర్వాత రూటు మార్చింది. చైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ గుణశేఖర్‌ (Gunasekhar)తో ‘శాకుంతలం’ (Shaakuntalam) మూవీలో నటించింది సామ్. నిజానికి ఈ ప్రాజెక్ట్ 2020 అక్టోబర్‌లో ప్రకటించినప్పటికీ.. పాండమిక్ తదితర కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఇక షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ.. 3D వెర్షన్ కోసం జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సమంత లేటెస్ట్ మూవీ ‘యశోద’ మంచి సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం ‘శాకుంతలం’ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

గుణ టీమ్ వర్క్స్ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 17 నుంచి మీ సమీప థియేటర్లలో ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’ వీక్షించండి. 3D వెర్షన్‌లో సైతం!!’ అంటూ సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో కూడిన రిలీజ్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా టైటిల్ రోల పోషించగా.. దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు.