వైజాగ్ లో ఐకాన్ స్టార్ కి భారీ వెల్కమ్.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూట్ ఆల్రెడీ స్టార్ట్ కాగా లేటెస్ట్ గా అయితే మేకర్స్ బన్నీ సహా వైజాగ్ కి చేరుకున్నారన్న వార్త సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. మరి వైజాగ్ లో బన్నీ భారీ ఫాలోయింగ్ ఉంది. తాను ఎప్పుడు ఎలాంటి సమయంలో వచ్చినా కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే తనకి గ్రాండ్ వెల్కమ్ నే అందిస్తారు.
ఇక ఈసారి కూడా బన్నీ నిన్న రాత్రి సమయంలో వైజాగ్ కి చేరుకోగా అక్కడ బన్నీ ఆర్మీ తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. దీనితో బన్నీ పై ఫోటోలు వీడియో లు వైరల్ గా మారాయి. దీనితో బన్నీ క్రేజ్ అక్కడ ఉంటుందో మరోసారి కనిపించింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రశ్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ లు సినిమాలు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
