
ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి : గవర్నర్
‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా మువ్వన్నెల జెండా) ఉత్సవాల్లో భాగంగా సాలార్‌జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల చాయా చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, తెలంగాణ విభాగం తరఫున ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ పతాకాన్ని పగలు, రాత్రి (24 గంటలు) వేళల్లో ఎగరవేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 20న భారత జాతీయ పతాక నియమావళిని సవరించిందన్నారు.