India vs Australia: బ్లాక్‌లో మ్యాచ్ టికెట్లు.. ఫ్యాన్స్ ఆందోళన.

సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ టిక్కెట్లను విక్రయించాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. దీంతో గురువారం ఉదయం జింఖానా మైదానంలో టిక్కెట్ల కోసం యువత పెద్ద ఎత్తున బారులు తీరారు.

కాగా, ఒకరికి రెండు టిక్కెట్లు మాత్రమే ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. టిక్కెట్లు కొనేందుకు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ తీసుకురావాలి. అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విధించిన నిబంధనలతో టిక్కెట్ల విక్రయానికి సంబంధించి స్వల్ప గందరగోళం నెలకొంది.