
“పుష్ప 2 ది రూల్” నుండి ఫాహద్ ఫాజిల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం లో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు కావడం తో మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.
సెకండ్ పార్ట్ లో కూడా ఆయన అలరిస్తారు అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. రిలీజైన పోస్టర్ స్టైలిష్ గా ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.