గాంధీ ఆస్పత్రిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్నారు.

గాంధీ ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న పనులను పశుసంవర్ధక శాఖ మంత్రి టి.శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి బుధవారం పరిశీలించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని ప్రకటించారు.

పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు కూడా మంత్రుల వెంట ఉన్నారు.