హైదరాబాద్‌ పట్ల సీజేఐ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉంది: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రం అన్నిరంగాల్లో ఆర్థికంగా పురోగమిస్తోందని, తెలంగాణలో ఆర్థిక పురోగతి సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన న్యాయాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... విద్యుత్, వ్యవసాయ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ పట్ల సీజేఐ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉందని తెలిపారు.  సీజేఐ చొరవతో హైకోర్టు జడ్జీల సంఖ్య పెరిగిందన్నారు. 
ఈ సందర్భంగా ఎన్వీ రమణకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బెంచ్‌ల పెంపునకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలని అన్నారు. జిల్లా కోర్టులకు అదనపు సిబ్బంది కేటాయింపు జరుగుతోందని, జిల్లాల్లో కోర్టు భవనాల కోసం స్థలాల ఎంపిక జరుగుతోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.