Mega 154 : సవతి సోదరుల కథ?
మెగాస్టార్ చిరంజీవి (Chiaranjeevi) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నదొకటి. Mega 154 గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే మాస్ టైటిల్ ను ఖాయం చేయబోతున్నట్టు గతంలో శేఖర్ మాస్టర్ (Sekhar Master), చిరంజీవిలు ఇదివరకే లీకు చేసిన సంగతి తెలిసిందే. వాల్తేరు సముద్రతీరం నేపథ్యంలో పక్కా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. శ్రుతి హాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది ఈ సినిమా.
ఇక ఈ సినిమా హైలైట్స్‌లో ప్రధానంగా చెప్పుకోదగ్గది రవితేజ (Raviteja) కీలక పాత్ర. మాస్ మహారాజా ఈ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటిస్తూ అతడు సెట్స్‌లోకి జాయిన్ అవడాన్ని ఒక వీడియోతో చెప్పడం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో రవితేజ ఏ పాత్ర చేస్తున్నాడు అనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. నిజానికి ఇందులో రవితేజ చిరంజీవికి తమ్ముడిగా నటిస్తున్నాడని ఇదివరకే వార్తలొచ్చాయి. ‘అన్నయ్య’ (Annayya) సినిమా తర్వాత చిరు, రవితేజ మరోసారి అన్నదమ్ములుగా స్ర్కీన్ షేర్ చేసుకోనున్నారని వార్తలు రావడంతో మరింతగా ఆసక్తి పెరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో చిరంజీవి, రవితేజలు సవతి సోదరులని తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇగో క్లాషే చిత్రం మెయిన్ కాన్ఫ్లిక్ట్ అని టాక్. గతంలో మణిరత్నం (Maniratnam) ‘ఘర్షణ’ (Gharshana), శోభన్ బాబు, రాజశేఖర్ ‘బలరామకృష్ణులు (Balaramakrishnulu)’, రీసెంట్‌గా నానీ (Nani) ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) చిత్రాలు ఈ తరహా కథాంశాలతోనే తెరకెక్కాయి. అయితే ఆ సినిమాలకీ, ‘వాల్తేరు వీరయ్య’ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది పక్కా మాస్ యాక్షన్ మూవీ.
ఒకరు మాస్ కా బాస్, మరొకరు మాస్ మహారాజా.. ఈ ఇద్దరూ కలిసి తెరపై పోట్లాడుకుంటే.. అదెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వచ్చే సంక్రాంతికి మెగాభిమానులకు కన్నుల పండుగే. రవితేజ ఈ మధ్యకాలంలో ఇలా ఒక హీరో సినిమాలో కీలక పాత్ర పోషించడం లాంటిది చేయలేదు. తన అభిమాన హీరో చిరంజీవి సినిమా కాబట్టి.. ఆ అభిమానాన్ని ఇలా చూపించుకున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. మరి నిజంగానే ఈ చిత్రంలో చిరు, రవితేజలు సవతి సోదరులుగా పోట్లాడుకుంటారేమో చూడాలి.
