
బై పోల్‌కు రెడీ: బండి సంజయ్ సవాల్
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఓటమిని ముందే రాజగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ తర్వాత మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యుద్దమే చేశారని వివరించారు. అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తాం అని పేర్కొన్నారు.
ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము భయపడం అని తెలిపారు. తమ కార్యకర్తలు చక్కగా పనిచేశారని వివరించారు. ఈ గెలుపుతో అధికార పార్టీ విర్రవీగుతోందని ఆరోపించారు. తమ పార్టీలో మాత్రం రాజీనామా చేసిన తర్వాతే.. చేర్చుకుంటామని తెలిపారు. మీ లాగా అంగట్లో పశువుల మాదిరిగా కొనుగోలు చేయబోమని వివరించారు.
12 మంది ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన పార్టీలో చేర్చుకున్నారని అడిగారు. వారు రాజీనామా చేసిన తర్వాత చేర్చుకోవాల్సింది అన్నారు. వారి చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేయాలని చేశారు. ఉప ఎన్నికలకు వెళదాం అని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. కానీ అహంకారంతో మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఓడిపోతే కుంగిపోం అని తెలిపారు.
ఈ గెలుపు అయ్యా గెలుపా.. కొడుకు గెలుపా, అల్లుడి గెలుపా, అభ్యర్థి గెలుపా, సీపీఐ, సీపీఎం గెలుపా.. లేదంటే కాంగ్రెస్ పార్టీ విజయం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.