
“NBK107” టైటిల్ లాంచ్ కి బాలయ్య డేట్ ఫిక్స్ చేశారా?
టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా టైటిల్ ఇంకా రివీల్ కాలేదు. టైటిల్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే దాని పై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. విజయవాడలో బాలయ్య ఓటీటీ షో అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఓపెనింగ్‌లో ఈ సినిమా టైటిల్‌ను లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. అయితే ఈ టైటిల్ ఈవెంట్‌కి బాలయ్య ప్రత్యేకంగా ముహూర్తం పెట్టుకున్నారని, టైటిల్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తారని తెలుస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తోంది.