‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్..

నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాప‌బుల్’ షో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ షో ప్ర‌క‌టించిన‌ప్పుడు బాల‌య్య హోస్ట్ అన‌గానే చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఏంటీ బాల‌య్య హోస్ట్‌గా చేస్తున్నాడా? నిజ‌మేనా? అంటూ చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. టాక్‌ షోలకు రావడానికే ఆలోచించే బాలయ్య.. టాక్‌షోను ఎలా హోస్ట్‌ చేస్తున్నాడు అంటూ అనుకున్నారు. బాల‌య్య‌కు కోపం ఎంతుందో.. ప్రేమ అంత‌కంటే ఎక్కువే ఉంటుంది. ఇండ‌స్ట్రీలో చాలా మంది బాల‌య్య‌ది చిన్న పిల్లాడి మ‌న‌స్థ‌త్వం అంటుంటారు. కాగా ఈ షోతో బాల‌కృష్ణలోని మ‌రో కోణాన్ని చూశాం. బాల‌య్య‌ ఎంత స‌రదా మ‌నిషి అని ఈ షోతో చాలా మంది ప్రేక్ష‌కులకు తెలిసింది.

‘ఆహా’ వేదిక‌గా ప్రారంభ‌మైన ఈ షోకు విశేష ఆద‌ర‌ణ వ‌చ్చింది. ఈ క్రమంలో ‘అన్‌స్టాప‌బుల్’ రెండో సీజ‌న్ స్టార్ట్ చేస్తున్న‌ట్లు ఆహా సంస్థ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రెంబో సీజ‌న్‌ను ఇంకాస్త గ్రాండియ‌ర్‌గా రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి కొద్ది రోజుల్లో సీజ‌న్‌-2 ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే సెలబ్రెటీల లిస్ట్‌ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ లిస్ట్‌లో పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి, ప్రభాస్‌, అనుష్క, త్రివిక్రమ్‌ వంటి పలువురు స్టార్‌లు రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ట్రైలర్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 ట్రైలర్‌ను అక్టోబర్‌ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య కౌ బాయ్‌ గెటప్‌లో వెనక్కి తిరిగి ఉన్నాడు.

అన్‌స్టాపబుల్‌ సీజ‌న్‌-1కు విప‌రీమైన రెస్పాన్స్ రావ‌డంతో సీజ‌న్‌-2 కోసం అల్లుఅర‌వింద్ బాగానే ఖ‌ర్చు పెడుతున్నాడ‌ట‌. ఇక ప్ర‌స్తుతం బాల‌య్య ‘NBK107’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ డ్రామాగా ఉండ‌నుందట‌. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌య్య పోస్ట‌ర్‌ల‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది.