Ankapur Chicken: అంకాపూర్ చికెన్.. తయారీ విధానం

Ankapur Chicken: చికెన్ అందరికీ ఇష్టమే. అయితే కొంతమందికి కోడి పులుసు ఇష్టం ఉంటే.. మరి కొందరికి మాత్రం కోడి మాంసాన్ని ఇష్టంగా తింటారు. చాలా మంది బాయిలర్ కోడి మాంసాన్ని రకరకాలుగా వండుకుంటారు. మరికొందరేమో నాటు కోళ్లతో చేసే వంటకాన్ని ఇష్టపడతారు. అయితే నాటుకోడి కూరకు పర్యాయపదంగా మారింది అంకాపూర్ చికెన్ కర్రీ. అంకాపూర్ చికెన్ కర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి అంకాపూర్ చికెన్ గురించి తెలిసే ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉంటుంది అంకాపూర్ గ్రామం.ఇక్కడి నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చికెన్ కర్రీ పార్శిళ్లు వెళ్తుంటాయి. వారాంతాల్లో అంకాపూర్ చికెన్ కు మరింత డిమాండ్ పెరుగుతుంది.

అంకాపూర్ చికెన్ కు కావాల్సిన పదార్థాలు: * నాటుకోడి - కిలో * ఉల్లిపాయలు * అల్లం వెల్లుల్లి పేస్టు * ధనియాల పొడి * కరివేపాకు * పసుపు * ఎండు కొబ్బరి పొడి * పల్లి నూనె * మసాలా * మెంతి * బిర్యానీ ఆకులు తయారీ విధానం:

1. నాటుకోడికి పసుపు రాసి మంటపై కాల్చాలి. తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ ముక్కులకు అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, మసాలాలు, పసుపు వేసి కలపాలి.

2. గిన్నెలో నూనె వేడి చేసుకుని బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, మెంతి, కరివేపాకు వేసుకోవాలి. కాసేపటి తర్వాత అది గిన్నెలో ముందుకు కలిపి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి.

3. ముక్కలు ఉడుకుతున్నప్పుడే కొబ్బరి పొడి, మసాలా వేసుకుని చక్కగా ఉడికిన తర్వాత దించేసుకోవడమే. నోరూరించే అంకాపూర్ స్టైల్ చికెన్ కర్రీ సిద్ధం అయినట్లే. అన్నంలో వేడి వేడి నాటుకోడి కూర వేసుకుని మధురమే.