స్టార్ హీరో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..

'పటాస్' సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన బ్లాక్ బస్టర్ మూవీ 'ఎఫ్ 2'కు సీక్వెల్‌గా 'ఎఫ్-3' తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కంప్లీట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మే 27న  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఒక‌ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాను బాల‌కృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసందే. అయితే, ఈ సినిమా మ‌ల్టీ స్టారర్ అని వార్త‌లు వ‌స్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నేను 'ఎఫ్-3' మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నానని, నెక్స్ట్  సినిమా కోసం క‌థ ఇప్ప‌టికే రెడీ అయ్యిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ మూవీ ఒకే హీరోతో తెరకెక్కే సినిమా అని కన్‌ఫర్మ్ చేశారు. 'ఎఫ్-3' సినిమా విడుద‌లయ్యాక కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తామని అనిల్ రవిపూడి తెలిపారు.