రూ.50 వేల లోపే ఐఫోన్ కొనేయండి...ఈ దీపావళికి
ఐఫోన్ కొనాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారా? మంచి ఆఫర్ వస్తే యాపిల్ ఐఫోన్ (Apple iPhone) కొనాలనుకుంటున్నారా? ఆ ఆఫర్స్ వచ్చేశాయి. దీపావళికి రూ.50 వేల లోపే ఐఫోన్ కొనేయండి.
యాపిల్ (Apple) కంపెనీ తయారు చేసే ఐఫోన్ల (iPhones)కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అత్యుత్తమ కెమెరాలు, అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్, కట్టుదిట్టమైన ప్రైవసీ అందించే ఐఫోన్ కొనాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే వీటి ధరలు అధికంగా ఉండటంతో చాలా మంది కోరిక కలగానే మిగిలిపోతోంది.
కాగా ఈ ఫెస్టివల్ సీజన్‌లో వారి కల నెరవేర్చేందుకు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు ఇప్పుడు ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ మోడళ్లపై కళ్లు చెదిరే ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్స్ ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్లపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ ఆఫర్లతో రూ.50 వేల లోపు ధరలతోనే ఐఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.
iPhone 11: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 64GB వేరియంట్ రూ.41,990, 128GB వేరియంట్ రూ.46,990 ధరలకే లభిస్తున్నాయి. వీటిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లు ఉపయోగించుకుని ఇంకా తక్కువ ధరలకే వీటిని సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్‌లో 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లే, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. త్వరలో ఐఫోన్ 11 రూ.36,990కే తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
iPhone 12: ప్రస్తుతం అమెజాన్‌లో యాపిల్ ఐఫోన్ 12 64GB వేరియంట్ వైట్ కలర్ రూ.48,999, బ్లూ కలర్ రూ.47,999 డిస్కౌంట్ ధరలతో దొరుకుతున్నాయి. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్‌పై రూ.1,250 వరకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అమెజాన్ రూ.25 వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అప్పుడు దీని ధర చాలా వరకు తగ్గుతుంది. 2020లో విడుదలైన ఈ మొబైల్ A14 బయోనిక్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది.
iPhone 12 Mini: ప్రస్తుతం ఐఫోన్ 12 మినీ 128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.59,990కి అందుబాటులో ఉంది. 64GB వేరియంట్ రూ.54,990కి సేల్ అవుతోంది. కాగా ఓల్డ్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.16,900 వరకు తగ్గించుకోవచ్చు. అప్పుడు రూ.43,000లకే ఐఫోన్ 12 మినీ 128GB వేరియంట్ సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారులు నో-కాస్ట్ EMI, బై నౌ పే లేటర్ వంటి ఆప్షన్స్ కూడా వాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, IP68 రేటింగ్‌తో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నైట్ మోడ్‌తో కూడిన 12MP TrueDepth సెల్ఫీ కెమెరా, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
iPhone 13: ఐఫోన్ 13 128GB బేస్ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66,990కి అందుబాటులో ఉంది. ఈ ధరను ఓల్డ్ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.16,900 వరకు తగ్గించుకోవచ్చు. అప్పుడు ఐఫోన్ 13 బేస్ మోడల్ రూ.50,090కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మీ ఓల్డ్ ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే ఐఫోన్ 13ని రూ.50,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్ప్లాష్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ IP68 రేటింగ్‌తో లాంఛ్ అయింది.
అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ మళ్లీ ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు కొనాలనుకునే ఐఫోన్‌ను బ్యాంక్ డిస్కౌంట్‌తో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
