
క్రాస్ రోడ్స్ లో “బ్రో” సినిమాకి వచ్చిన అకీరా.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో దర్శకుడు సముద్రఖని తెరెకక్కించిన చిత్రం “బ్రో ది అవతార్” హంగామా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే నడుస్తుంది. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం మాస్ లో సెలెబ్రేషన్స్ కి కేరాఫ్ అయ్యినటువంటి మాస్ థియేటర్స్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కూడా మెగా ఫ్యాన్స్ మామూలు హంగామా చేయడం లేదు.
అయితే క్రాస్ రోడ్స్ లో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆనంద్ అంతా కూడా ఓ రేంజ్ లో రెట్టింపు అయిపోయింది. బ్రో చిత్రాన్ని ఈ ఉదయం ఫ్యాన్స్ తో కలిసి వీక్షించేందుకు పవన్ వారసుడు అకీరానందన్ అయితే సుదర్శన్ లో వీక్షించేందుకు అకీరా ఎంట్రీ ఇవ్వగా ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు అకీరా కి కూడా గ్రాండ్ వెల్కమ్ అందించగా తాను ఫ్యాన్స్ మధ్య లోనుంచి థియేటర్ లోకి వెళ్ళిపోయాడు. దీనితో ఇప్పుడు ఈ వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.