ఆదిపురుష్ – ఫస్ట్ లుక్ మరియు టీజర్‌పై అప్‌డేట్?
ప్రభాస్, ఓం రౌత్‌ల ఆదిపురుష్ సినిమా కోసం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తాం అని వెల్లడించారు. ఈ నెల 26న ఆదిపురుష్ పాత్రలో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల కానుందని హిందీ మీడియా పేర్కొంది.
మరోవైపు ప్రభాస్, కృతి సనన్ సరయు నది పక్కనే అయోధ్యలో టీజర్‌ను లాంచ్ చేయనున్నారు.
అక్టోబర్ 5వ తేదీన, ప్రభాస్ ఢిల్లీలో దసరా సందర్భంగా జరిగే లవ్ కుష్ రామ్‌లీలాకు హాజరవుతారు మరియు రావ్ దిష్టిబొమ్మను దహనం చేసి, ప్రమోషన్‌లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఈ ప్రమోషన్ల గురించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.
