హైదరాబాద్‌లో ఆసియా క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ

 గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా ఈ ఏడాది జూన్‌ 23 నుంచి జూలై 4 వరకు ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు.