
ఖుషి టైటిల్‌తో వస్తున్న విజయ్, సామ్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇదే డైరెక్టర్‌తో కలిసి జనగనమణ మూవీ చేయనున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇందులో సమంత అతడితో జోడీ కట్టింది. సోమవారం ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్‌డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్.
విజయ్, సమంతల మూవీకి ఖుషి టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇందులో విజయ్ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.